గుండె కవాట వ్యాధుల్లో ఒకటైన సంక్లిష్ట అయోర్టిక్ స్టెనోసిస్ సమస్య పెరుగుతోంది. 60-80 ఏళ్లు దాటిన వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటోందని వైద్యులు చెబుతున్నారు. గతంతో పోల్చితే నగరంలో ఈ సమస్యకు సంబంధించి సర్జరీలు 34 శాతం వరకు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. గుండె నుంచి రక్తాన్ని శరీరానికి పంపే ప్రధాన వాల్వు సన్నబడటాన్ని అయోర్టిక్ స్టెనోసిస్‌గా వ్యవహరిస్తారు. ఫలితంగా గుండె నుంచి శరీర అవయవాలకు రక్తం సరఫరా మందగిస్తుంది. దీర్ఘకాలంలో అవయవాల పనితీరు దెబ్బతింటుంది. ప్రధానంగా వృద్ధుల్లో ఎక్కువగా వస్తుంది. తొలుత ఎలాంటి లక్షణాలు కన్పించక పోవడంవల్ల దీనిని సైలెంట్ కిల్లర్‌గా నిపుణులు చెబుతుంటారు. గతంలో ఈ సమస్యకు బైపాస్ సర్జరీ ఒక్కటే దిక్కు. కానీ వయసు పైబడిన వారు మందులతో నెట్టుకొచ్చేవారు. బైపాస్ జోలికి వెళ్లేవారు కాదు. తర్వాత కాలంలో ట్రాన్స్‌క్యాథర్ అయోర్టిక్ వాల్వు రిప్లేస్‌మెంట్(టీఏవీఆర్) ఆధునాతన సర్జరీతో సమస్యను పరిష్కరిస్తున్నారు. ఈ తరహా సర్జరీలకు ఎక్కువ మంది హైదరాబాద్ వైపు చూస్తున్నారు. విదేశాల నుంచి కూడా ఈ సర్జరీలకు రోగులు ఇక్కడికి విచ్చేస్తున్నారు.
ఏటా 400 వరకు సర్జరీలు: గతేడాది నగరంలో దాదాపు 350 నుంచి 400 వరకు ఈ తరహా సర్జరీల జరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. చాలామంది తమకు తాము నిర్ణయం తీసుకొని చికిత్సలకు దూరంగా ఉంటున్నారు. చివరికి అది తీవ్రంగా మారుతోందని ఏఐజీ కార్డియాక్ క్యాథ్‌ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ అనూజ్ కపాడియా తెలిపారు. 90 ఏళ్లు దాటిన వారికి సైతం టీఏవీఆర్ ద్వారా ప్రాణాలు కాపాడుతున్నట్లు చెప్పారు. సర్జరీ చేసిన 3-5 రోజ్లులోనే డిశ్చార్జి చేస్తారు. బైపాస్ సర్జరీ మాదిరి వారాల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం లేదు.
ప్రధాన లక్షణాలు..
ఆయాసం: చిన్నపాటి నడకకే ఊపిరి ఆడకపోవడం
తీవ్ర అలసట: కారణం లేకుండానే నీరసం
ఛాతిలో నొప్పి: ఏదైనా చిన్న పనిచేసినా.. మెట్లు ఎక్కుతున్న సమయంలో ఛాతిలో బిగుతు, నొప్పి అన్పించడం
కాళ్లవాపు: కాళ్లలో వాపు కన్పిస్తుంది. గుండె వైఫల్యానికి ఇది మొదటి సంకేతం.
ముందే ఈ జాగ్రత్తలు అవసరం..
లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. 50 ఏళ్లు దాటాక ఏడాదికోసారి ఈసీజీ, 2డీ ఎకో తప్పకుండా చేసుకోవాలి. నోటి, గొంతు ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవాలి. టీఏవీఆర్ చేయించుకున్న తర్వాత రక్తం పల్చపడానికి వాడే మందులను డాక్టర్ చెప్పినంత కాలం వాడాలి. ఆహారంలో ఉప్పు తగ్గించడం, నడక లాంటి తేలికపాటి వ్యాయామం, బీపీ నియంత్రణలో పెట్టుకోవడం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















