కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే న్యాయవ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిపాలన న్యాయమూర్తి Justice Battu Devanand సూచించారు. అమలాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం కోర్టు ప్రాంగణంలో 14వ జిల్లా అదనపు కోర్టు, సెషన్స్ జడ్జి కోర్టు, రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు, మేజిస్ట్రేట్ కోర్టులను హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. కార్యక్రమానికి జస్టిస్ ఆర్. రఘునందన్ రావు, జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి, జస్టిస్ న్యాపతి విజయ్, జస్టిస్ జగడం సుమతి తదితరులు హాజరయ్యారు.జస్టిస్ ఆర్. రఘునందన్ రావు మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయవ్యవస్థ సాంకేతికతను ఉపయోగించి వేగంగా తీర్పులు ఇవ్వాలని సూచించారు. డిజిటల్ వ్యవస్థల వినియోగం ఇప్పుడు అత్యవసరమని జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి తెలిపారు.
జస్టిస్ న్యాపతి విజయ్ మాట్లాడుతూ సామాజిక మార్పులకు అనుగుణంగా తీర్పులు ఉండాలని పేర్కొన్నారు. జస్టిస్ జగడం సుమతి మాట్లాడుతూ కక్షిదారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా న్యాయవాదులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.జిల్లా న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ కొత్త కోర్టులు కేసుల భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అనంతరం న్యాయమూర్తులను జిల్లా అధికారులు, బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు.అలాగే కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టును కూడా హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















