కేంద్రమంత్రి Bandi Sanjay Kumar కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి Revanth Reddy ఆదేశించారు. కేసు నమోదైనప్పటికీ చర్యల్లో జాప్యం ఎందుకు జరిగిందని ఆయన డీజీపీ CV Anandను ప్రశ్నించారు.
ఈనెల 8న ఫిర్యాదు అందినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్ల కారణంగా సిబ్బంది బిజీగా ఉన్నారని డీజీపీ వివరించారు. అనంతరం కేసు వివరాలను సీఎంకు అందించారు.కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. దీంతో కూకట్‌పల్లి డీసీపీ Ruturajకు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు.
పేట్‌బషీరాబాద్ పోలీసులు బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు భగీరథ్ కూడా తనపై బెదిరింపులు జరుగుతున్నాయని కరీంనగర్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పరస్పర కేసులు నమోదయ్యాయి.ఈ వ్యవహారంపై రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. కమిషన్ చైర్‌పర్సన్ Sita Dayakar Reddy కేసు వివరాలు సేకరించి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















