పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో భారత్‌లో ఇంధన రంగంపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. ముడిచమురు ధరల పెరుగుదల కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఒక్క త్రైమాసికంలోనే దాదాపు రూ.లక్ష కోట్ల వరకు నష్టం వచ్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
సీఐఐ వార్షిక వ్యాపార సదస్సులో మాట్లాడిన ఆయన, దేశంలో ఇంధన సరఫరా సమస్యలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం 69 రోజుల ముడిచమురు, ఎల్‌ఎన్‌జీ నిల్వలు, అలాగే 45 రోజుల ఎల్‌పీజీ నిల్వలు ఉన్నాయని తెలిపారు.
అయితే ధరల పెరుగుదల కొనసాగితే చమురు కంపెనీలు రోజుకు సుమారు రూ.1000 కోట్ల నష్టాల్లో నడుస్తున్నాయని వెల్లడించారు. మొత్తం రెవెన్యూ లోటు ఇప్పటికే రూ.1.98 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు.పశ్చిమాసియా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపు ఒక ముఖ్యమైన హెచ్చరిక అని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు ఇంధన వినియోగాన్ని తగ్గించడం, ప్రజా రవాణా ఉపయోగించడం, వర్క్ ఫ్రమ్ హోం ప్రోత్సహించడం వంటి చర్యలు అవసరమని ప్రభుత్వం సూచిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















