దేశీయంగా పసిడి కొనుగోళ్లు తగ్గిస్తే దాదాపు 3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్‌స్మిత్ ఫెడరేషన్ (ఏఐజేజీఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ మారక నిల్వలను కాపాడేందుకు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలన్న సూచనలపై ఫెడరేషన్ స్పందించింది.
పసిడి డిమాండ్ తగ్గించడం సమస్యకు పరిష్కారం కాదని, దీని వల్ల ఆభరణాల తయారీ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని తెలిపింది. చిన్న వ్యాపారులు, చేతివృత్తుల వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించింది.
దీనికి బదులుగా దేశీయంగా బంగారం సమీకరణ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని ఏఐజేజీఎఫ్ సూచించింది. బులియన్ బ్యాంక్ ఏర్పాటు, గోల్డ్ ఈటీఎఫ్‌ల ద్వారా నియంత్రిత రుణ వ్యవస్థ, గోల్డ్ మానిటైజేషన్ పథకం పునర్‌వ్యవస్థీకరణ వంటి ప్రతిపాదనలు చేసింది.
అలాగే పన్ను విధానాల్లో సవరణలు, జీఎస్టీ తొలగింపు, జాతీయ స్థాయి గోల్డ్ డాష్‌బోర్డ్ ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. ఇది కేవలం వ్యాపార సమస్య కాకుండా పెద్ద స్థాయి ఉపాధి సమస్య అని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















