పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభం మరియు ఎల్‌నినో ప్రభావం కారణంగా భారత్ ఆర్థిక వృద్ధిపై ఒత్తిడి పెరుగుతుందని హెచ్‌ఎస్‌బీసీ నివేదిక వెల్లడించింది. 2026-27లో దేశ జీడీపీ వృద్ధి 6 శాతానికి పరిమితం కావచ్చని అంచనా వేసింది. అదే సమయంలో 2025-26లో ఇది 7.4 శాతంగా ఉండొచ్చని తెలిపింది.
ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు సార్లు వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇంధన ధరల పెరుగుదలతో పాటు వర్షపాతం తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది.
ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరడంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.7 వరకు పెరగవచ్చని అంచనా వేసింది. ఒకవేళ ధరలు పెంచకపోతే ద్రవ్యోల్బణం 5.3 శాతానికి చేరే అవకాశం ఉందని తెలిపింది.ఇతర సంస్థల అంచనాల ప్రకారం బీఎంఐ, ఎస్‌బీఐ రీసెర్చ్ కూడా భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం నుంచి 7.7 శాతం మధ్య ఉండవచ్చని తెలిపాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















