నీట్ యూజీ-2026 పరీక్ష రద్దు నిర్ణయం రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులకు తీవ్ర నిరాశ కలిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 73,024 మంది అభ్యర్థులు నమోదు చేసుకోగా, వారిలో 71,304 మంది పరీక్ష రాశారు. ప్రశ్నపత్రం ఈసారి కొంత సులభంగా వచ్చిందని భావిస్తూ మంచి ర్యాంకులపై ఆశలు పెట్టుకున్న విద్యార్థులు ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా, పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించడం పెద్ద షాక్‌గా మారింది.
2016-17 విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఒకే అర్హత పరీక్షగా నీట్‌ను ప్రవేశపెట్టారు. అయితే గత కొన్నేళ్లుగా ప్రశ్నపత్రాల లీకేజీలు, పరీక్షల వాయిదాలు, అవకతవకల ఆరోపణలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా 2024లో నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో కొంతమంది విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది.
ఈసారి కూడా పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తడంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఏడాది పాటు కష్టపడి సిద్ధమైన విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో పరీక్ష కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాసిన విద్యార్థులు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు.విద్యార్థులపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఎన్‌టీఏ, లీకేజీలను అరికట్టడంలో మాత్రం విఫలమైందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఒకసారి పరీక్ష రాసి మళ్లీ పరీక్షకు సిద్ధమవ్వడం వల్ల విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్య విద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఈ వ్యవహారంపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందిస్తూ, నీట్ రద్దు అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ఎన్‌టీఏ అయోమయంలోకి నెట్టిందని విమర్శించారు. పరీక్ష నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కారణమైన వారిపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















