రాష్ట్రంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ పురోగతిపై కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పలు కీలక సూచనలు చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్య తీవ్రతకు అనుగుణంగా స్పందించని కలెక్టర్లపైనా ప్రభుత్వం వెనకాడదని స్పష్టం చేశారు. ధాన్యం తరలింపునకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లపై అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
గోడౌన్ల కొరత ఉన్న ప్రాంతాల్లో రైతుబజార్లు, ఫంక్షన్ హాళ్లు వంటి ప్రదేశాలను తాత్కాలిక నిల్వ కేంద్రాలుగా వినియోగించాలని సీఎం సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని అధికారులకు తెలిపారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని, ధాన్యం తడవకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.మొక్కజొన్న పంట అధికంగా వచ్చే జిల్లాల్లో కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవాలని సూచించారు. ధాన్యం లోడింగ్ పూర్తయ్యిన వెంటనే రైతులకు రసీదులు అందించాలని, దీంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని సీఎం పేర్కొన్నారు.
ఇక పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని తెలిపారు. మరోవైపు సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణకు తరలివస్తోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అలాగే బాయిల్డ్ రైస్ కోటా పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అదనంగా 14.78 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కోటాను రాష్ట్రానికి కేటాయించడంతో యాసంగి సీజన్‌కు ఊరట లభించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















