దేశ రాజధాని దిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ 2026–30 ముసాయిదాను విడుదల చేసింది.
ఈ ప్రతిపాదనల ప్రకారం 2027 జనవరి 1 నుంచి త్రీ వీలర్ వాహనాలకు కేవలం ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్ మాత్రమే అనుమతి ఉంటుంది. తరువాత దశలో టూ వీలర్లను కూడా ఇదే విధానంలోకి తీసుకురానున్నారు. చివరగా 2028 ఏప్రిల్ 1 నుంచి కొత్తగా పెట్రోల్, డీజిల్ బైక్‌ల రిజిస్ట్రేషన్ పూర్తిగా నిలిపివేయనున్నారు.ఈవీ కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. రూ.2.25 లక్షల విలువైన టూవీలర్ కొనుగోలుపై కిలోవాట్ అవర్‌కు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. త్రీవీలర్ ఈవీలకు తొలి ఏడాది రూ.50 వేల ప్రోత్సాహకం కూడా అందుతుంది.
పాత వాహనాలను తుక్కుగా మార్చి ఈవీలకు మారితే కూడా అదనపు ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాకుండా నగరవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.కాలుష్య సమస్య తీవ్రంగా ఉన్న శీతాకాలాల్లో వాయు నాణ్యత మెరుగుపరచడం కోసం ఈ నిర్ణయాలు కీలకంగా భావిస్తున్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత తుది పాలసీని అమలు చేయనున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















