ప్రముఖ నటి రష్మిక మందన్న తనలో ఉన్న అతిపెద్ద భయాన్ని అధిగమించిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ‘మైసా’ షూటింగ్ కోసం కొచ్చిలో ఉన్న ఆమె, ఎత్తులంటే ఉన్న తన భయాన్ని ధైర్యంగా ఎదుర్కొని దానిని జయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడి షూటింగ్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.
“కొచ్చిలో గడిపిన రోజులు నాకు ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చాయి. అడవులు, కీటకాలు, జలపాతాలు, ట్రెక్కింగ్‌లు, వర్కౌట్లు, వర్షాలు ఇలా ప్రతి క్షణం ఒక కొత్త అనుభవంలా అనిపించింది. నాకు ఎత్తులంటే చాలా భయం. కానీ ఇక్కడ ఆ భయాన్ని ఎదుర్కొని జయించాను. యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. మోకాళ్లకు గాయాలైనా పట్టువదలకుండా షూటింగ్ కొనసాగించాను. ఉదయం లేచే క్షణం నుంచి, ఎంతో ఇష్టమైన పళం పూరీలు తినే వరకు ప్రతి అనుభవాన్ని ఆస్వాదించాను” అని రష్మిక పేర్కొన్నారు.
రవీంద్ర పుల్లె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మైసా’ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల్లో రష్మిక డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకినట్లు దర్శకుడు గతంలో వెల్లడించారు. ఆ సమయంలో ఆమెకు చేతులు, కాళ్లకు గాయాలైనప్పటికీ, షూటింగ్‌ను నిలిపివేయకుండా కొనసాగించినట్లు తెలిపారు.
ఇక మరోవైపు రష్మిక వ్యక్తిగత జీవితం కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆమె భర్త విజయ్ దేవరకొండతో కలిసి చేసిన ఓ వాణిజ్య ప్రకటన ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది. ఈ జంటకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా “విరోష్” జోడీగా వీరిని పిలుస్తున్నారు.
ఈ ఇద్దరూ కలిసి చేసిన యాడ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అది ఇప్పటివరకు 9.1 మిలియన్లకు పైగా లైక్స్ సాధించి ప్రపంచవ్యాప్తంగా రెండో అత్యధిక లైక్స్ పొందిన ప్రకటనగా రికార్డు సృష్టించింది. ఆసక్తికరంగా, ఇదే జాబితాలో మొదటి స్థానంలో ఉన్న రికార్డు కూడా వీరిద్దరిదే కావడం విశేషం. గతంలో వారు కలిసి చేసిన మరో యాడ్‌కు 11.5 మిలియన్లకు పైగా లైక్స్ వచ్చి 104 మిలియన్ వ్యూస్‌తో గ్లోబల్ రికార్డు నెలకొల్పింది.
ప్రస్తుతం ఈ జంట కలిసి నటిస్తున్న ‘రణబాలి’ ప్రాజెక్ట్‌పై కూడా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















