Andhra Pradesh లోని Kakinada district లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న మహిళా కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన టిప్పర్ వాహనం ఢీకొనడంతో నలుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని వెంటనే కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మృతులను చీడిగ గ్రామానికి చెందిన వాసంశెట్టి సత్యవతి (60), పాలిక కృష్ణవేణి (35), చిట్టెమ్మ (45), చెల్లూరి అన్నవరం (45)గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన మట్టపర్తి అరుణ కుమారి, పాలిక నాగమణి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబాలను పోషించేందుకు ఉపాధి పనులకు వెళ్తున్న మహిళలు ప్రాణాలు కోల్పోవడం గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ ఘటనపై Pawan Kalyan తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మహిళా ఉపాధి కూలీలు మృతి చెందడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. పని ప్రదేశాల్లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు తక్షణ సాయం అందించడంతో పాటు పరిహారం మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. అలాగే పని ప్రాంతాల వద్ద వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు టిప్పర్ డ్రైవర్‌పై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి అధిక వేగమే కారణమా లేదా ఇతర సాంకేతిక లోపాలున్నాయా అనే దానిపై విచారణ కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















