మనకు నిద్ర అత్యంత అవసరమైన శారీరక ప్రక్రియగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిద్ర సమయంలో శరీరంలో కణాల మరమ్మతు, మెదడు శుభ్రపరిచే ప్రక్రియలు, హార్మోన్ల సమతుల్యత వంటి కీలక పనులు చురుకుగా జరుగుతాయి. అందుకే తగినంత నిద్ర పొందడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం.
తాజా పరిశోధనల ప్రకారం, రోజుకు సుమారు 6.4 గంటల నుంచి 7.8 గంటల వరకు నిద్రించే వారిలో శారీరక వృద్ధాప్య ప్రక్రియ నెమ్మదిగా జరుగుతున్నట్టు గుర్తించారు. అయితే 6 గంటల కన్నా తక్కువగా లేదా 8 గంటల కన్నా ఎక్కువగా నిద్రించే వారిలో శారీరక వృద్ధాప్యం వేగంగా పెరుగుతున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
తక్కువ లేదా ఎక్కువ నిద్ర నేరుగా అవయవాల వృద్ధాప్యానికి కారణమవుతుందనే స్పష్టమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ మెదడు, గుండె, కాలేయం వంటి అన్ని అవయవాల ఆరోగ్యం నిద్ర నాణ్యతతో బలంగా అనుసంధానమై ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. నిద్ర పద్ధతులు వయోప్రక్రియతో పాటు మెదడుపై పడే ఒత్తిడితో కూడా సంబంధం కలిగి ఉంటాయని గత పరిశోధనలు పేర్కొన్నాయి.
కొలంబియా యూనివర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనం ప్రకారం, తక్కువ లేదా అతిగా నిద్రించడం దాదాపు అన్ని అవయవాల వృద్ధాప్యాన్ని వేగవంతం చేయవచ్చని తొలిసారి బలమైన ఆధారాలు లభించాయని చెబుతున్నారు.
జబ్బుల ముప్పు కూడా ఎక్కువే
నిద్ర వ్యవధి మరియు వివిధ వ్యాధుల మధ్య సంబంధం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. తక్కువ నిద్రించే వారిలో డిప్రెషన్, ఆందోళన, ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు, గుండె లయ తప్పడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అదేవిధంగా తక్కువ నిద్ర లేదా అతిగా నిద్ర రెండూ గురక, ఉబ్బసం, ఛాతీలో మంట వంటి జీర్ణ సంబంధ సమస్యలకు కారణమవుతున్నాయని వెల్లడైంది. అంతేకాకుండా ఈ రెండు పరిస్థితుల్లో ఉన్నవారికి వివిధ కారణాల వల్ల మరణించే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.
మొత్తంగా చూస్తే, నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాకుండా శరీరంలోని ప్రతి భాగంతో లోతుగా అనుసంధానమై ఉన్న కీలక ప్రక్రియ అని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















