తిరుమలలో భక్తుల రద్దీ ఇవాళ కూడా కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్సులు, నారాయణగిరి ఉద్యానవన షెడ్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు శ్రీవారి సేవ సదన్ భవనం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని దర్శన సమయాల నిర్వహణ, క్యూలైన్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజూ అదనంగా 15 వేల మందికిపైగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని వివరించారు.
నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 79,603 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారని ఆయన వెల్లడించారు. క్యూలైన్ వ్యవస్థను గంటగంటకూ పర్యవేక్షించడం ద్వారా దర్శనాల సంఖ్యను పెంచుతున్నామని తెలిపారు. తితిదే, విజిలెన్స్, పోలీసులు సమన్వయంతో పనిచేస్తూ రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు.
సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ, అందరికీ సజావుగా దర్శనం కల్పించేందుకు అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని తితిదే అధికారులు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















