దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా–ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై వచ్చిన అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణాన్ని తీసుకురావడంతో, దాని ప్రభావం భారత మార్కెట్లపై కూడా కనిపించింది. రూపాయి విలువ బలపడటం, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ రంగాల్లో భారీ కొనుగోళ్ల మద్దతు సూచీలకు అదనపు బలం ఇచ్చాయి. ఒక దశలో సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడైనా, చివరికి మోస్తరు లాభాలతో ముగిసింది. నిఫ్టీ మాత్రం 23,700 మార్క్‌ను ఎగువన నిలిచి క్లోజ్ అయింది.
సెన్సెక్స్ ఉదయం 75,260.39 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. రోజంతా సానుకూల ధోరణిలో కొనసాగిన సూచీ ఇంట్రాడేలో 75,810.97 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 231.99 పాయింట్ల లాభంతో 75,415.35 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 64.60 పాయింట్ల లాభంతో 23,719.30 వద్ద ముగిసింది. అదే సమయంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 63 పైసలు బలపడి 95.73కు చేరింది.
సెక్టార్ వారీగా చూస్తే సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు ప్రధానంగా లాభాలను నమోదు చేశాయి. మరోవైపు సన్‌ఫార్మా, ఐటీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, బీఈఎల్, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధర 105.07 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 4532 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















