జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన ప్రత్యేక ప్రయాణంతో అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు పిలుపు, రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం మేరకు ప్రతి శుక్రవారం ‘నో వెహికల్ డే’ పాటిస్తున్న ఆయన.. ఈసారి పాలకొల్లు నుంచి విజయవాడ వరకు రైలులో ప్రయాణించి, అక్కడి నుంచి సైకిల్‌పై మంగళగిరికి వెళ్లారు.
శుక్రవారం ఉదయం ఇంటి నుంచి సైకిల్‌పై పాలకొల్లు రైల్వే స్టేషన్‌కు చేరుకున్న మంత్రి నిమ్మల.. జనరల్ బోగీలో సాధారణ ప్రయాణికులతో కలిసి విజయవాడకు వచ్చారు. రైలులో తోటి ప్రయాణికుడు ఇచ్చిన అల్పాహారం స్వీకరించి వారితో సరదాగా ముచ్చటించారు. అనంతరం రామవరప్పాడు స్టేషన్‌లో దిగి సుమారు 18.6 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ మంగళగిరి బయల్దేరారు.
మధ్యలో కొలనుకొండ వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కూడా సైకిల్‌పై ఎక్కించుకుని ఇద్దరూ కలిసి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజల్లో పొదుపు, పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడమే లక్ష్యమన్నారు. అలాగే జగన్ చేస్తున్న వ్యాఖ్యలపై ప్రజల్లో ఆందోళన నెలకొందని వ్యాఖ్యానించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















