ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలు సోమవారం హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి ప్రపంచ రికార్డ్ గుర్తింపు లభించింది. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఆయన ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలోనే ఎస్వీ కృష్ణారెడ్డికి రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేయడంతో పాటు, ఆయన ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ‘వేదవ్యాస్’ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు ఆయన సేవలను ప్రశంసించారు.
సీనియర్ నటుడు మురళీమోహన్ మాట్లాడుతూ ఎస్వీ కృష్ణారెడ్డి నూరేళ్లు జీవించి మరిన్ని గొప్ప చిత్రాలు చేయాలని ఆకాంక్షించారు. నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ ఆయన దర్శకత్వంలో నటించడం తనకు లభించిన అదృష్టమని అన్నారు. నటుడు అలీ మాట్లాడుతూ 42 చిత్రాల్లో 38 సినిమాలకు సంగీతం అందించడం అసాధారణమైన విషయం అని, ఆయన గొప్ప మనసున్న వ్యక్తి అని కొనియాడారు.
‘వేదవ్యాస్’ చిత్ర నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు. ఈ వేడుకలో అశ్వనీదత్, చదలవాడ శ్రీనివాసరావు, రేలంగి నరసింహారావు, కె. అచ్చిరెడ్డి, రఘుబాబు, జేడీ చక్రవర్తి, లయ, దామోదర్ ప్రసాద్, అశోక్ కుమార్, కిశోర్ రాఠీ, సి. కల్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణ, ఆచంట గోపీనాథ్, ప్రసన్నకుమార్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు, తెలుగు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















