దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి Rajiv Ranjan Singh తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం పంచాయతీలకు కేటాయించే నిధులను గతంతో పోలిస్తే రెట్టింపు చేసినట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025’, ‘నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్-2025’ అవార్డులను కేంద్ర మంత్రి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్ర నిధులకు అదనంగా పంచాయతీలకు మరింత నిధులు కేటాయిస్తే గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలు పంచాయతీలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. సుపరిపాలన విభాగంలో అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలోని శృంగవరం గ్రామ పంచాయతీ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆన్‌లైన్ పాలన, పారదర్శక సేవల అమలులో ఈ పంచాయతీ ప్రత్యేక గుర్తింపు పొందింది.
మహిళా మిత్ర విభాగంలో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని బొక్కసంపాలెం గ్రామ పంచాయతీ మొదటి స్థానం సాధించింది. పేదరిక నిర్మూలన, జీవనోపాధుల మెరుగుదల విభాగంలో వైఎస్సార్ కడప జిల్లా చెముళ్లపల్లి పంచాయతీ జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది.
అలాగే స్వావలంబన మౌలిక వసతుల అభివృద్ధి విభాగంలో ప్రకాశం జిల్లా గుండమాల గ్రామ పంచాయతీ మూడో ర్యాంకు సాధించింది. ఉత్తమ బ్లాక్ పంచాయతీ విభాగంలో కుప్పం మూడో బహుమతిని దక్కించుకుంది. ఈ విజయాలు గ్రామీణాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీల పనితీరుకు నిదర్శనంగా నిలిచాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















