ఆంధ్రప్రదేశ్‌లో భానుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల ప్రకారం గురువారం 46 మండలాల్లో తీవ్ర వడగాలులు, 79 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశముందని అధికారులు తెలిపారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. బుధవారం మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం, నెల్లూరు జిల్లా గూడూరులో 44 డిగ్రీలు నమోదు కాగా, కృష్ణా, పల్నాడు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల్లోనూ 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అయితే ఎండలతో పాటు కొన్ని జిల్లాల్లో వర్ష సూచనలు కూడా ఉన్నాయి. ద్రోణి ప్రభావంతో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇతర జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
వడగాలుల నేపథ్యంలో వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండటం, ఎక్కువగా నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















