తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వచ్చే తొమ్మిది నెలల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ జలాశయం నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా సోమశిలలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న సీఎం, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల పూర్తి కోసం భూసేకరణ ప్రక్రియకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని కలెక్టర్లు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రతి నెల రూ.500 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించిన సీఎం, పునరావాసం మరియు పునర్నివాస కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులను రెండు నుంచి మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రాజెక్టు కింద రూ.1,400 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఇంజినీర్లు వివరించగా, వాటిని దశలవారీగా విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే ప్రతిపాదిత లక్ష్మీదేవిపల్లి జలాశయం నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలని సూచించారు.
కరవు ప్రాంతాలకు నీటిని అందించే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. రెండు నెలల్లో భూసేకరణ పూర్తి చేసి, కాలువల నిర్మాణానికి వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు.
ఇక కోయిలసాగర్ ఎత్తిపోతల పథకం ఇరవై ఏళ్లుగా పూర్తి కాకపోవడంపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కల్వకుర్తి, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల పురోగతిపైనా సీఎం సమీక్ష నిర్వహించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















