ఉక్కపోత, ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను నైరుతి రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
ఈ నెల 10వ తేదీకల్లా రాష్ట్రంలోని సగానికి పైగా ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వచ్చే రెండు నుంచి మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో తొలకరి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇక గురువారం నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1 నాటికే రుతుపవనాలు కేరళలో ప్రవేశించాల్సి ఉండగా ఈసారి మూడు రోజుల ఆలస్యంగా చేరుకున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే రుతుపవనాల సీజన్‌లో దాదాపు 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
రుతుపవనాలు ప్రారంభమైనా వెంటనే ఉక్కపోత, వేడి పూర్తిగా తగ్గకపోవచ్చని అధికారులు తెలిపారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వేడిగాలుల ప్రభావం మరికొన్ని రోజులు కొనసాగవచ్చని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















