ఈగల్ ఆపరేషన్‌లో గంజాయి కింగ్‌పిన్ మహ్మద్ సొహైల్ అరెస్టుతో అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్ బహిర్గతమైంది. ఒడిశా నుంచి తమిళనాడు, కేరళ వరకు విస్తరించిన భారీ గంజాయి రవాణా ముఠా వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
కేరళలోని మళప్పురం జిల్లాకు చెందిన సొహైల్ ఒడిశాలోని గంజాయి సాగు ప్రాంతాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని అక్కడి రైతులు, మధ్యవర్తుల ద్వారా పెద్ద ఎత్తున సరకును సేకరించి వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడు, కేరళలో విస్తరించిన నెట్‌వర్క్ ద్వారా అతను దీర్ఘకాలంగా డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడని విచారణలో తేలింది.
సొహైల్‌తో పాటు ఒడిశాకు చెందిన అరూప్‌సింగ్, రాజేష్‌కుమార్‌సింగ్‌లను కూడా ఈగల్ బృందం వలపన్ని అదుపులోకి తీసుకుంది. వీరిని వివిధ ప్రాంతాల్లో పట్టుకుని విచారిస్తున్న పోలీసులు, ముఠా కార్యకలాపాలపై కీలక సమాచారాన్ని రాబడుతున్నారు.
పాత కార్ల వ్యాపారం ముసుగులో గంజాయి రవాణా జరుగుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సొహైల్ దిల్లీ నుంచి పాత వాహనాలు కొనుగోలు చేసి వాటిని కేరళలో విక్రయించేవాడు. ఇదే సమయంలో ఒడిశా గజపతి, కొరాపుట్ ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేసి రహస్యంగా ఇతర రాష్ట్రాలకు తరలించేవాడు.
తాజాగా ముగ్గురూ కలిసి ఈ నెల 4న దిల్లీ వెళ్లి రెండు పాత కార్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. అనంతరం ఒడిశాలో సుమారు 200 కిలోల గంజాయి సేకరించగా, అందులో 140 కిలోలను ప్యాక్ చేసి తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్లకు అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. కోయంబత్తూరుకు సరకు చేరవేస్తే రూ.30 వేలు ఇస్తామని డ్రైవర్లను ప్రలోభపెట్టినట్లు తెలుస్తోంది.
ముందుగా కారులో తరలించేందుకు ప్రయత్నించినా నిఘా ఎక్కువగా ఉండటంతో లారీల ద్వారా రవాణా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఈగల్ విభాగం పక్కా సమాచారంతో రంగంలోకి దిగింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితులుగా ఉన్న వేలాది మంది డేటాను విశ్లేషించి, యాక్టివ్‌గా ఉన్న నేరస్థుల కదలికలను గమనిస్తూ సొహైల్‌పై ప్రత్యేక నిఘా పెట్టింది. శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు విస్తరించిన ఈగల్ బృందాలు సమన్వయంతో అతని కదలికలను ట్రాక్ చేసి అరెస్ట్ చేశాయి.
అనంతరం అరూప్‌సింగ్, రాజేష్‌కుమార్‌సింగ్‌లను రాజమహేంద్రవరం పరిసరాల్లో పట్టుకుని విచారించగా, లారీ డ్రైవర్లు సెల్వం, ప్రదీప్ పాత్ర కూడా బయటపడింది. వారి ద్వారా గంజాయి రవాణా జరుగుతోందని గుర్తించి సరకు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ముఠా నెట్‌వర్క్‌పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















