బయట బీఆర్‌ఎస్, శాసనసభ లోపల భాజపా గందరగోళం సృష్టిస్తూ సభా సమయాన్ని వృథా చేస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించి పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, రెండు పార్టీలు రాజకీయ అంశాలను ముందుకు తెచ్చి సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించారు.
ప్రజలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించాల్సిన అసెంబ్లీ సమయాన్ని అనవసర రాజకీయ వివాదాలతో వృథా చేయడం సరికాదని ఆది శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే మూడు రోజుల సభా సమయం వృథా అయిందని, ప్రజా సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాల కోసం సభను ఉపయోగించుకునే ప్రయత్నాలను విపక్షాలు మానుకోవాలని సూచించారు.
స్పీకర్‌పై జరిగిన అవమానకర ఘటనపై చర్చ జరపాలని కోరుతున్నప్పటికీ బీఆర్‌ఎస్ అందుకు ముందుకు రావడం లేదని ఆయన విమర్శించారు. మరోవైపు 22ఏ అంశంపై చర్చ జరపాలంటూ భాజపా సభలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రతి సమస్యపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నిర్మాణాత్మక చర్చలకు విపక్షాలు సహకరించాలని ఆది శ్రీనివాస్ కోరారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















