చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరిస్తూ, తమను ఎన్నుకున్న ప్రజల సమస్యలను సమర్థంగా ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి సూచించారు. రాజకీయ పార్టీల కంటే పార్లమెంటరీ విలువలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ అత్యున్నత వేదిక అని పేర్కొన్నారు.
దిల్లీలో జరిగిన 2026 సంసద్ రత్న అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్‌రెడ్డి.. చట్టసభల్లో నిర్మాణాత్మక చర్చలు జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పనితీరుపై విపక్షాలకు అభ్యంతరాలు ఉంటే సూటిగా ప్రశ్నించాలని, విధానాలపై సునిశితంగా విమర్శలు చేయాలని సూచించారు. సభా కార్యక్రమాలను అడ్డుకోవడం, గందరగోళం సృష్టించడం ప్రజాస్వామ్య సంప్రదాయాలకు అనుగుణం కాదని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, భారాస వ్యవహరిస్తున్న తీరుపై కిషన్‌రెడ్డి విమర్శలు చేశారు. సభలో నెలకొంటున్న పరిస్థితులు ప్రజాస్వామ్య విలువలపై ఆందోళన కలిగించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించినట్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విమర్శించడం లేదా అవసరమైతే వాకౌట్ చేయడం వంటి ప్రజాస్వామ్య పద్ధతులను అనుసరించాలని అన్నారు.
ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాలుగు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్లతో కలిపి మొత్తం 16 మంది ఎంపీలకు సంసద్ రత్న అవార్డులను ప్రదానం చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, కేంద్ర సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం, పలువురు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















