అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు పోలీసులపై దాడికి పాల్పడిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. చింతపల్లి మండలం అన్నవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై స్మగ్లర్లు రాళ్లు రువ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఓ స్మగ్లర్ హెడ్ కానిస్టేబుల్ కాలర్ పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పరిస్థితి అదుపు తప్పే సూచనలు కనిపించడంతో ఎస్సై వెంటనే స్పందించి తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో స్మగ్లర్లు పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని చుట్టుముట్టి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు అక్కడి నుంచి పారిపోయినట్లు సమాచారం.
అన్నవరం పోలీసులు తెల్లవారుజామున లోతుగెడ్డ వంతెన నుంచి రామారావుపాలెం కూడలి వరకు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బలపం ఘాట్‌రోడ్డు వైపు నుంచి వస్తున్న కారు, రెండు ద్విచక్రవాహనాలను ఆపేందుకు ప్రయత్నించగా స్మగ్లర్లు ఒక్కసారిగా దాడికి దిగినట్లు అధికారులు వెల్లడించారు.
వెంటనే స్పందించిన ఎస్సై సాయిరామ్ ఆధ్వర్యంలోని బృందం పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. ఘటనలో సుమారు 209.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సరుకు విలువ సుమారు రూ.1.04 కోట్లు ఉంటుందని అంచనా వేశారు.
పట్టుబడిన నిందితులను రాజస్థాన్‌కు చెందిన అర్జుకుమార్, విశాఖపట్నం జిల్లాకు చెందిన ఇమ్రాన్‌ఖాన్, ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాకు చెందిన కిషాణ ఖారా, అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం గ్రామానికి చెందిన పాంగి శ్రీనుగా గుర్తించినట్లు ఎస్పీ అమిత్ బర్దార్, ఏఎస్పీ నవజ్యోత్ మిశ్రా వివరించారు. కేసులో పరారీలో ఉన్న వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















