దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణం నేపథ్యంలో ఆయనతో నటి రాధికకు ఉన్న అనుబంధం మరోసారి గుర్తుకు వస్తోంది. ఆయనను తన గురువుగా భావించే రాధిక, ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక భావోద్వేగంగా వరుస పోస్టులు షేర్ చేశారు. ఆయనతో దిగిన జ్ఞాపకాలను పంచుకుంటూ, “మీరే నా సర్వస్వం” అంటూ హృదయాన్ని తాకేలా నివాళి అర్పించారు. ఆయన లేరన్న నిజం తనను తీవ్రంగా కలచివేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
“నన్ను తీర్చిదిద్దిన ఇద్దరు వ్యక్తులు నా తల్లి, నా గురువు భారతీరాజా. ఒక్క ఏడాదిలోనే వీరిద్దరినీ కోల్పోవడం నాకు తీరని వేదనగా ఉంది. ఈ బాధను మాటల్లో చెప్పలేను” అంటూ ఆమె భావోద్వేగంగా రాసుకొచ్చారు. తనకు అండగా నిలిచిన అభిమానులు, సన్నిహితులకు కృతజ్ఞతలు తెలిపారు.
సినీ వేదికలపై భారతీరాజాపై తనకున్న గౌరవాన్ని రాధిక పలు సందర్భాల్లో వ్యక్తం చేసిన వీడియోలను కూడా ఆమె పంచుకున్నారు. “భారతీరాజా సర్.. మీరే నా సర్వసం, మీ ఆత్మకు శాంతి చేకూరాలి” అని క్యాప్షన్ పెట్టారు.
రాధికను సినీ ప్రపంచానికి పరిచయం చేసింది కూడా భారతీరాజానే. 1977లో వచ్చిన ‘16 వయథినిలే’తో దర్శకుడిగా గుర్తింపు పొందిన ఆయన, తన రెండో చిత్రం ‘కిళక్కే పొగమ్ రైల్’ ద్వారా రాధికను పరిచయం చేశారు. ఆ సినిమా విజయంతో రాధికకు వరుస అవకాశాలు వచ్చి ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
భారతీరాజా తన కెరీర్‌లో రాధికను ఎంతో ప్రతిభావంతురాలిగా భావించేవారు. ఇటీవలే ఆమెను కలిసిన సమయంలో కూడా ఆమె నటించిన ‘తాయ్‌కిళవి’కి జాతీయ అవార్డు వస్తుందని ప్రోత్సహించినట్లు సమాచారం. ఈ సంఘటనలు ఇప్పుడు అభిమానుల్లో మరింత భావోద్వేగాన్ని రేకెత్తిస్తున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















