చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రి వేళ దొంగల ముఠా దోపిడీకి పాల్పడి ప్రయాణికుల్లో భయాందోళన సృష్టించింది. బాపట్ల జిల్లాలోని బాపట్ల–అప్పికట్ల మధ్య నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో సోమవారం వేకువజామున 1.12 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రాజస్థాన్‌కు చెందిన సుమారు ఆరుగురు సభ్యుల ముఠా ముందుగా నెల్లూరు స్టేషన్‌లో రైలు ఎక్కినట్లు సమాచారం. ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో ఎస్-3 బోగీలో కాకినాడకు చెందిన మహిళ వద్ద 45 గ్రాముల బంగారు గొలుసు, ఎస్-6 బోగీలో రాజమహేంద్రవరానికి చెందిన మరో మహిళ వద్ద 30 గ్రాముల బంగారు గొలుసును దోచుకున్నట్లు తెలుస్తోంది. మరికొంతమంది ప్రయాణికుల నుంచి కూడా నగలు అపహరించినట్లు బాధితులు తెలిపారు.
దోపిడీ సమయంలో బాధితులు కేకలు వేయడంతో ఇతర ప్రయాణికులు అప్రమత్తమై ప్రతిఘటించారు. ఈ క్రమంలో కొందరు దొంగలు చైన్ లాగి రైలును నిలిపివేసినట్లు సమాచారం. వెంటనే ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు రంగంలోకి దిగగా, దొంగలు వారిపై రాళ్లు రువ్వుతూ పరారయ్యారు.
దొంగలను పట్టుకునే ప్రయత్నంలో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు కాల్పులు జరిపినప్పటికీ చీకటి కారణంగా వారు తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో సర్కార్ ఎక్స్‌ప్రెస్ సుమారు 16 నిమిషాలు నిలిచిపోయి అనంతరం గుంటూరు వైపు ప్రయాణం కొనసాగించింది.
చోరీకి గురైన బంగారు ఆభరణాల విలువ సుమారు రూ.11.25 లక్షలుగా రైల్వే పోలీసులు అంచనా వేశారు. ఘటన అనంతరం తెనాలి, విజయవాడ రైల్వే స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు.
ఇప్పటివరకు ముఠా సభ్యుడు సోనూను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మిగిలిన నిందితుల కోసం పది ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని ఆర్పీఎఫ్, జిల్లా పోలీసులు పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారు. భద్రతా లోపాలపై కూడా అధికారులు సమీక్ష ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















