మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌ల) కోసం సవరించిన నియమావళిని ప్రవేశపెట్టింది. ధరల నిర్ణయ విధానాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంతో పాటు మదుపర్ల రక్షణను లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం ఈటీఎఫ్‌ల ప్రాథమిక ధరను ముందు రోజు ముగింపు ధర ఆధారంగా నిర్ణయిస్తారు. దీనిని కనీసం 30 నిమిషాల వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ (VWAP) ఆధారంగా లెక్కిస్తారు. ఒకవేళ చివరి 30 నిమిషాల్లో ట్రేడింగ్ జరగకపోతే, రోజులో చివరిగా ట్రేడైన ధరను ప్రాథమికంగా తీసుకుంటారు. ఆ రోజే ట్రేడింగ్ జరగకపోతే తాజా ఎన్‌ఏవీ (NAV)ని ప్రాథమిక ధరగా పరిగణిస్తారు.
2027 ఏప్రిల్ 1 నుంచి టీ-1 రోజు ముగింపు ఎన్‌ఏవీని ప్రాథమిక ధరగా అమలు చేయాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలకు సెబీ సూచించింది.
అలాగే ఓవర్‌నైట్, లిక్విడ్ ఈటీఎఫ్‌లను మినహాయించి మిగతా ఈక్విటీ, డెట్ ఈటీఎఫ్‌లకు డైనమిక్ ధరల శ్రేణిని ప్రవేశపెట్టింది. ఇందులో ప్రారంభంగా +/-10% ధర పరిమితి ఉంటుంది. అవసరమైతే కూలింగ్ ఆఫ్ పీరియడ్ తర్వాత ఇది 20% వరకు విస్తరించవచ్చు.
ఓవర్‌నైట్, లిక్విడ్ ఈటీఎఫ్‌లకు +/-5% ఫిక్స్‌డ్ ప్రైస్ బ్యాండ్ కొనసాగుతుంది. ఇక కమోడిటీ ఈటీఎఫ్‌లకు ఎటువంటి అప్పర్ లేదా లోయర్ పరిమితి లేకుండా ట్రేడింగ్ కొనసాగుతుంది. రోజులో అవసరాన్ని బట్టి ధర పరిమితులను ఎన్నిసార్లైనా విస్తరించుకునే అవకాశం కూడా కల్పించారు.
కమోడిటీ ఈటీఎఫ్‌ల కాల్ ఆక్షన్ కోసం ప్రీ-ఓపెన్ సెషన్‌ను కూడా ప్రవేశపెట్టారు. దీని ద్వారా ధర నిర్ణయం మరింత సరిగ్గా జరగుతుందని సెబీ భావిస్తోంది.
ఈ కొత్త నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate MovieNews News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















