పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ఎల్పీజీ సరఫరా మెరుగుపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య వినియోగదారులకు వంటగ్యాస్ సరఫరాపై ఇటీవల విధించిన ఆంక్షలను గురువారం ఎత్తివేసింది. యుద్ధ సంక్షోభానికి ముందు ఉన్న స్థాయికి సరఫరాలను పునరుద్ధరించినట్లు ప్రకటించింది.
ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయిన బల్క్ ఎల్పీజీ సరఫరాను పునఃప్రారంభించేందుకు నిర్ణయం తీసుకుంది. పశ్చిమాసియా సంక్షోభానికి ముందు స్థాయితో పోలిస్తే 50 శాతం వరకు సరఫరాను అనుమతించనున్నట్లు పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం, విదేశీ దిగుమతులు మెరుగుపడటం వంటి కారణాలతో ఈ ఆంక్షలను సడలించినట్లు కేంద్రం తెలిపింది. ఇది వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఊరట కలిగించే పరిణామంగా భావిస్తున్నారు.
అమెరికా–ఇరాన్ యుద్ధం కారణంగా గతంలో సరఫరా గొలుసుకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడానికి కేంద్రం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, పరిశ్రమలకు వాణిజ్య సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది.
అందుబాటులో ఉన్న వంటగ్యాస్‌ను గృహ వినియోగానికి మళ్లించగా, పెట్రోకెమికల్స్ తయారీకి ఉపయోగించే సీ3, సీ4 స్ట్రీమ్స్‌ను కూడా వంటగ్యాస్ ఉత్పత్తికి మళ్లించినట్లు తెలిపింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో ఈ మళ్లింపును తగ్గించి తిరిగి పెట్రోకెమికల్స్ రంగానికి కేటాయిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది.
ఎల్పీజీ వినియోగదారుల డేటాను సమగ్రంగా నిర్వహించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది. అలాగే సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏకీకృత సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















