మార్గదర్శి చిట్ ఫండ్స్ సేవలు మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా నిలుస్తున్నాయని ఆ సంస్థ ఎండీ శైలజాకిరణ్ తెలిపారు. కామారెడ్డిలో మార్గదర్శి చిట్ ఫండ్స్ 131వ శాఖను ఆమె లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఆమె ఉద్యోగులు, సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. చిట్ ఫండ్స్ ద్వారా పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్థిక క్రమశిక్షణతో పాటు భరోసా లభిస్తుందని శైలజాకిరణ్ పేర్కొన్నారు.
వ్యవసాయ, పారిశ్రామిక ప్రాంతంగా ఉన్న కామారెడ్డిలో కొత్త శాఖను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. స్థానిక ప్రజలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు ఈ శాఖ ఉపయోగపడుతుందని చెప్పారు.
బ్రాంచిలో తొలి చిట్ వేసిన ఖాతాదారుడు రాజమౌళి నుంచి డీడీ స్వీకరించి రశీదు అందజేశారు. అనంతరం సిబ్బందితో సమావేశమై చిట్స్ నిర్వహణపై పలు సూచనలు చేశారు.
ఎన్నో సంవత్సరాలుగా మార్గదర్శి చిట్స్‌లో పొదుపు చేస్తూ తమ అవసరాలను తీర్చుకుంటున్నామని వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మార్గదర్శి సీఈవో సత్యనారాయణ రావు, వైస్ ప్రెసిడెంట్ బలరామకృష్ణ, అడ్మిన్ రాజాజీ, కామారెడ్డి బ్రాంచ్ మేనేజర్ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















