దుబ్బాక పట్టణంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. 15వ వార్డులోని ఓ ఇంట్లో దొంగలు చొరబడి నగదు, బంగారాన్ని అపహరించారు. ఇంటి యజమాని కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
పట్టణానికి చెందిన చింత రాజ్‌కుమార్ అనే మెడికల్ ఏజెన్సీ నిర్వాహకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి 9 రోజుల క్రితం కాశీ యాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు ఇంటి కిటికీ ఊచలను విరగ్గొట్టి లోనికి ప్రవేశించారు.
తరువాత పడకగదిలోని లాకర్‌ను పగలగొట్టి అందులో ఉన్న బంగారం, నగదును ఎత్తుకెళ్లినట్లు సమాచారం. దొంగతనానికి గురైన బంగారం సుమారు కేజీ వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
సోమవారం ఉదయం ఇంటి ఆవరణ శుభ్రం చేసేందుకు వచ్చిన పనిమనిషి మంజుల ఇంటి తాళాలు పగిలి ఉండటం గమనించి యజమానికి సమాచారం అందించింది. వెంటనే బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించారు. భారీ చోరీ విషయం తెలుసుకున్న సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















