తెలంగాణలో ఏరోస్పేస్ రంగం పురోగతికి గణనీయమైన ఊతం ఇచ్చేలా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఈ నెల 30 నుంచి జులై 2 వరకు అంతర్జాతీయ విమానయాన సదస్సు జరగనుంది. ఈ సదస్సు ద్వారా రాష్ట్రాన్ని గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బోయింగ్, ఎయిర్‌బస్, లాక్‌హీడ్ మార్టిన్, జీఈ ఏరోస్పేస్, హనీవెల్ వంటి 25కు పైగా ప్రపంచ స్థాయి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. వీటితో పాటు వెయ్యికి పైగా చిన్నతరహా దేశీయ సరఫరా సంస్థలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
నాలుగు ప్రత్యేక ఏరోస్పేస్ పార్కులు, డీఆర్‌డీఓ ప్రయోగశాలలతో హైదరాబాద్ విమాన విడిభాగాల తయారీ, మెయింటెనెన్స్, మరమ్మతు సేవలు, ఆధునిక సాంకేతికతల కేంద్రంగా మారింది. ఈ నేపథ్యంలో ‘ఏరోమార్ట్ హైదరాబాద్ 2026’ సదస్సు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్, టీజీఐఐసీ సహకారంతో అడ్వాన్స్‌డ్ బిజినెస్ ఈవెంట్స్ (ఏబీఈ), బీసీఐ ఏరోస్పేస్ సంస్థలు నిర్వహించనున్నాయి. ప్రపంచ స్థాయి పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడం, పెట్టుబడులను ఆకర్షించడం ఈ సదస్సు ప్రధాన లక్ష్యంగా ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















