దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల అపహరణ కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. నిందితులను విచారించడంతో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆలయంలోని విరాళాల లెక్కింపు వ్యవస్థలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకున్న ఇంటిదొంగలు చాలా సులభంగా డబ్బును బయటకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు.
విచారణలో నిందితులు దొంగతనం చేసిన నగదును ఆలయ ప్రాంగణంలోని వాష్‌రూమ్‌ల్లో దాచిపెట్టి, అనుకూల సమయం చూసుకుని బయటకు తీసుకెళ్లినట్లు సమాచారం. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుపై పూర్తి అవగాహన ఉండటంతో, వాటికి చిక్కకుండా జాగ్రత్తగా ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కోర్టు అనుమతితో నిందితుల్లో ఒకడైన అవినాష్ శుక్లాను మంగళవారం రెండు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా అతడు కీలక వివరాలు బయటపెట్టినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
విరాళాల కౌంటింగ్ గదికి సంబంధించిన తాళాలను మరో నిందితుడు టిన్నూ యాదవ్ సంపాదించగా, ఆ తర్వాత ఖాళీ సమయాన్ని వినియోగించుకుని నగదు చోరీ చేసినట్లు శుక్లా అంగీకరించినట్లు సమాచారం.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులతో తమకు ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని ఎవరూ అనుమానం రాకుండా ఈ దొంగతనాలు కొనసాగించినట్లు అతడు తెలిపినట్లు తెలుస్తోంది. చోరీ చేసిన డబ్బుతో తాను ఇల్లు, స్థలం కొనుగోలు చేసినట్లు కూడా అంగీకరించినట్లు సమాచారం.
ఈ కేసులో ఇతర నిందితుల ఆర్థిక లావాదేవీలు, ఆస్తులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటన వెనుక మరింత మంది ఉన్నారా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. విచారణ సమయంలో ట్రస్టీ అనిల్ మిశ్రా పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















