ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతదేహాలు గుర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం అర్ధరాత్రి రైల్వే ట్రాక్‌పై విగతజీవులుగా పడి ఉన్న వారిని జీఆర్పీ పోలీసులు గుర్తించి, ఒకే కుటుంబ సభ్యులుగా నిర్ధారించారు.
మృతులు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 6వ వార్డు ప్రాంతానికి చెందిన షేక్ చాంద్‌బాషా (50), అతని భార్య హసీనా (45), కుమార్తెలు షర్మిల (23), సమీరా (20)గా గుర్తించారు. చాంద్‌బాషా స్థానికంగా కళ్లజోళ్ల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.
పెద్ద కుమార్తె షర్మిల ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతుండగా, రెండో కుమార్తె సమీరాకు గత ఏడాది వివాహం జరిగింది. అయితే కుటుంబం ఆర్థిక సమస్యలు, అప్పులు పెరగడం వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు సమాచారం.
అదనంగా కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారని తెలుస్తోంది. చాంద్‌బాషా గుండె సంబంధిత సమస్యలు, హసీనా మధుమేహం, రక్తపోటు, కాలేయ సమస్యలు, షర్మిల ఫిట్స్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరిన కుటుంబం చేబ్రోలు రైల్వే స్టేషన్‌కు చేరుకుని, చర్లపల్లి నుంచి షాలిమార్ వైపు వెళ్తున్న ప్రత్యేక రైలును ఎదుర్కొని ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కాకినాడ జీఆర్పీ సీఐ శ్రీనివాసరెడ్డి, తాడేపల్లిగూడెం ఎస్సై అప్పారావు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















