సీబీఎస్‌ఈ (కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు) విద్యార్థులకు కొత్త నిబంధన అమల్లోకి రానుంది. 2027-28 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు మూడో భాష (ఆర్3) ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది.
ఈ నిబంధనకు సంబంధించి ఈ నెల 10న సీబీఎస్‌ఈ అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. మూడో భాష ఇంటర్నల్ పరీక్షలో పాస్ కాకపోతే పదో తరగతి పూర్తి చేసినట్లు భావించబోమని, సర్టిఫికెట్ జారీ విషయంలో అర్హత కోల్పోయే అవకాశం ఉంటుందని పేర్కొంది.
అయితే ప్రస్తుతం 9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులకు ఈ నిబంధన వర్తించదని బోర్డు స్పష్టం చేసింది. 2027-28 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రవేశించే విద్యార్థులకే ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
కొత్త విధానం ప్రకారం పదో తరగతి బోర్డు పరీక్షల్లో మూడో భాష (ఆర్3) ప్రత్యేక పరీక్షగా ఉండదు. అయితే పాఠశాల స్థాయిలో నిర్వహించే ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో విద్యార్థులు తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. విద్యార్థుల భాషా నైపుణ్యాలను పెంపొందించడం, బహుభాషా అభ్యసనాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ మార్పు తీసుకొచ్చినట్లు సీబీఎస్‌ఈ తెలిపింది.
ఒకవేళ విద్యార్థులు మూడో భాష ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో ఉత్తీర్ణత సాధించకపోతే, వారికి మరోసారి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించే అవకాశం కల్పించాలని పాఠశాలలకు సూచించింది. ఈ ప్రక్రియ కారణంగా విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
సీబీఎస్‌ఈ పరిధిలోని పాఠశాలలు కొత్త నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులకు మూడో భాష బోధన, మూల్యాంకన ప్రక్రియలను నిర్వహించాలని బోర్డు ఆదేశించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును ముందుగానే గమనించి సిద్ధం కావాలని సూచించింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















