కృత్రిమ మేధ రంగంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. తమ ఏఐ వ్యవస్థ మరో ఏఐ కంపెనీకి చెందిన మోడల్‌ను హ్యాక్ చేసిందని చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్‌ఏఐ వెల్లడించింది. తమ ఏఐ మోడళ్ల సామర్థ్యాలను మూల్యాంకనం చేస్తున్న సమయంలో ఈ సైబర్ భద్రత ఘటన చోటుచేసుకున్నట్లు ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు.
ఇటీవల జరిగిన సైబర్ దాడి అత్యంత అధునాతన ఏఐ ఏజెంట్ ద్వారా జరిగినట్లు హగ్గింగ్ ఫేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ క్లెమంట్ డెలాంగ్ పేర్కొన్నారు. ఈ దాడి వెనుక ఒక ప్రముఖ సంస్థ ఉండవచ్చని తొలుత అనుమానించామని, అనంతరం అదే నిజమని తేలిందని తెలిపారు. ఈ ఘటనపై ఓపెన్‌ఏఐతో కలిసి 24 గంటల పాటు పనిచేసినట్లు వెల్లడించారు. ఇది దురుద్దేశపూర్వకంగా జరిగిన దాడి కాదని, ఏఐ స్వయంగా ఇలాంటి చర్యకు పాల్పడటం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
అత్యాధునిక ఏఐ మోడళ్ల వినియోగంతో సైబర్ భద్రతకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలు ఇప్పటికే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ వ్యవస్థల భద్రతకు సంబంధించి కీలక చర్యలు చేపట్టారు.
ఏదైనా అధునాతన ఏఐ వ్యవస్థ దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తే, ఆ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ముందు నెల రోజుల వరకు సమీక్షించే అధికారం ప్రభుత్వానికి కల్పించేలా చర్యలు తీసుకున్నారు. తాజా ఘటనతో ఏఐ రంగంలో సైబర్ భద్రత, మోడళ్ల నియంత్రణపై చర్చ మరింత వేడెక్కింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















