యాపిల్ కొత్త ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు తొలి ఫోల్డబుల్ ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా కొత్త ఐఫోన్లు విడుదలైన తర్వాత పాత మోడళ్ల ధరలను తగ్గించే యాపిల్.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. భారత్‌లో ఇప్పటికే విక్రయిస్తున్న పలు ఐఫోన్ మోడళ్ల ధరలను గణనీయంగా పెంచింది.
ఐఫోన్ 17లో 256జీబీ వేరియంట్ ధర రూ.82,900 నుంచి రూ.99,900కు చేరింది. 512జీబీ మోడల్ ధర రూ.1,02,900 నుంచి రూ.1,24,900కు పెరిగింది. ఐఫోన్ ఎయిర్ ధరల్లోనూ భారీ మార్పు చోటుచేసుకుంది. 256జీబీ మోడల్ రూ.1,19,900 నుంచి రూ.1,49,900కు, 512జీబీ వేరియంట్ రూ.1,39,900 నుంచి రూ.1,74,900కు చేరాయి. 1టీబీ వేరియంట్ ధర ఏకంగా రూ.1,59,900 నుంచి రూ.2,24,900కు పెరిగింది. అంటే రూ.65వేల పెంపు నమోదైంది.
ఐఫోన్ 17ఈ 256జీబీ వేరియంట్ ధర రూ.64,900 నుంచి రూ.79,900కు, 512జీబీ మోడల్ ధర రూ.84,900 నుంచి రూ.1,04,900కు చేరింది. ఇక ఐఫోన్ 16లో 128జీబీ వేరియంట్ ధర రూ.69,900 నుంచి రూ.89,900కు పెరిగింది.
మెమొరీ చిప్‌లు, ర్యామ్ వంటి భాగాల కొరత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ తదితర కారణాలతో ఉత్పత్తి వ్యయాలు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే యాపిల్ ధరలను సవరించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజాగా విడుదలైన ఐఫోన్ 18 సిరీస్ ప్రారంభ ధర రూ.1,64,900గా ఉంది. ఫోల్డబుల్ ఐఫోన్ డ్యూయో ప్రారంభ ధర రూ.2,99,900గా నిర్ణయించింది. కొత్త మోడళ్లకు సెప్టెంబరు 12 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా.. సెప్టెంబరు 18 నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















