అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐటీ షేర్లలో కొనుగోళ్లు, విదేశీ పెట్టుబడిదారుల మద్దతు మార్కెట్లకు కలిసొచ్చాయి. దీంతో నిఫ్టీ 24 వేల మార్క్‌ను దాటి ట్రేడవగా.. సెన్సెక్స్ కూడా గణనీయమైన లాభాలను నమోదు చేసింది.
ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 717 పాయింట్ల లాభంతో 77,493 వద్ద, నిఫ్టీ 207 పాయింట్లు ఎగబాకి 24,192 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.70 వద్ద ఉంది. నిఫ్టీలో లార్సెన్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్‌టెల్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాల్లో ఉండగా.. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇటీవల కృత్రిమ మేధ రంగంలో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు ప్రస్తుతం ఐటీ షేర్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు విదేశీ పెట్టుబడిదారులు భారత మార్కెట్లలో షేర్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపడం కూడా సూచీలకు బలాన్నిచ్చింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించే అవకాశాలున్నాయన్న అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌కు అనుకూలంగా మారాయి.
అయితే అమెరికా ముడిచమురు నిల్వలు తగ్గడం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు సుమారు 3 శాతం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 86 డాలర్లకు చేరాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















