ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఓ యువకుడి జీవితాన్ని విషాదంగా మార్చింది. బెట్టింగ్‌లో భారీగా నష్టపోయి అప్పుల పాలైన యువకుడు.. అప్పులు తీర్చినప్పటికీ నిర్వాహకుల వేధింపులు కొనసాగడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బాడ్సిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాడ్సికి చెందిన ఎర్రోళ్ల దశరథ్ (35) బీటెక్ పూర్తి చేసి రామాయంపేటలోని ఓ కెమికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడిన ఆయన సుమారు రూ.45 లక్షల వరకు అప్పులు చేశారు.
కుమారుడి పరిస్థితి తెలుసుకున్న తండ్రి లింగన్న.. చిట్టీలు వేసి అప్పులను తీర్చినట్లు తెలుస్తోంది. అయితే బెట్టింగ్ నిర్వాహకుల నుంచి వేధింపులు మాత్రం కొనసాగాయి. ఇటీవల దశరథ్‌ను నిందిస్తూ నిర్వాహకులు ఆయన తండ్రి వాట్సప్‌కు సందేశాలు పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
సోమవారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వస్తున్న సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి జీవితంపై విరక్తి కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే అతడి కోసం గాలింపు ప్రారంభించారు.
మోపాల్ పోలీసుల సహాయంతో మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా బాడ్సి సమీపంలోని కొండెం చెరువు వద్ద దశరథ్‌ను గుర్తించారు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునే సమయానికి వారి కళ్లెదుటే చెరువులోకి దూకడంతో విషాదం చోటుచేసుకుంది.
రాత్రి వేళ గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మృతదేహాన్ని వెలికితీశారు. దశరథ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య కరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















