ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన హిందాల్కో ఇండస్ట్రీస్ జూన్ త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్-జూన్ కాలంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.7,013 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.4,004 కోట్లతో పోలిస్తే లాభం 75 శాతం పెరిగింది.
కంపెనీ మొత్తం ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. గత ఏడాది రూ.64,834 కోట్లుగా ఉన్న ఆదాయం ఈసారి 32 శాతం వృద్ధితో రూ.85,882 కోట్లకు చేరింది. అన్ని వ్యాపార విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచినట్లు సంస్థ వెల్లడించింది.
సమీక్షా త్రైమాసికంలో అల్యూమినియం అప్‌స్ట్రీమ్ విభాగం రూ.13,403 కోట్ల ఆదాయాన్ని, రాగి విభాగం రూ.17,232 కోట్ల ఆదాయాన్ని నమోదు చేశాయి. హిందాల్కో అనుబంధ సంస్థ నొవెలిస్ ఆదాయం రూ.54,763 కోట్లకు చేరింది. ఏకీకృత ఎబిటా 37 శాతం పెరిగి రూ.14,989 కోట్లుగా నమోదైంది. అల్యూమినియం అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్, రాగి, నొవెలిస్ వ్యాపారాలు అత్యధిక త్రైమాసిక ఎబిటాను సాధించాయి.
రూ.50,000 కోట్ల పెట్టుబడుల ప్రణాళిక :
ఉత్పత్తి సామర్థ్యాలను మరింత పెంచేందుకు వచ్చే కాలంలో రూ.50,000 కోట్ల మూలధన పెట్టుబడులు పెట్టనున్నట్లు హిందాల్కో ఎండీ సతీశ్ పాయ్ తెలిపారు. అల్యూమినా, అల్యూమినియం, రాగి అప్‌స్ట్రీమ్ సామర్థ్యాల విస్తరణతో పాటు విలువ ఆధారిత డౌన్‌స్ట్రీమ్ ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. మరోవైపు లోహాల ధరలు అధికంగా ఉండటంతో కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరించారని, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా శుద్ధి చేసిన రాగి దిగుమతులు, అంతర్జాతీయ సరఫరాలపై ప్రభావం పడుతోందని పాయ్ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















