గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ మండలం రాఘవాపురం గ్రామంలో రూ.36 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన విలేజ్ వెల్నెస్ హెల్త్ సెంటర్ భవనాన్ని బుధవారం కూటమి నేతలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో చిన్నపాటి అనారోగ్య సమస్యలకు కూడా గతంలో ప్రజలు పట్టణాలు, సమీప నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని తెలిపారు. ఈ ఇబ్బందులను తొలగించి వైద్య సేవలను గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
విలేజ్ వెల్నెస్ హెల్త్ సెంటర్ల ద్వారా ప్రజలకు ప్రాథమిక వైద్యం, ఆరోగ్య సేవలు స్థానికంగానే అందుబాటులో ఉంటాయని చెప్పారు. వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరమైన సేవలు అందించడమే ఈ కేంద్రాల ప్రధాన ఉద్దేశమన్నారు.
ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ హెల్త్ సెంటర్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















