ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్‌లో దిల్లీలో భారత్ అధ్యక్షతన జరగనున్న బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఇరాన్ అధ్యక్షుడు భారత్‌కు రానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిక్స్ వేదికగా అంతర్జాతీయ, ప్రాంతీయ పరిణామాలతో పాటు భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది.
2024 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ అంశాలపై చర్చించారు.
గత ఏడాది బ్రెజిల్ వేదికగా బ్రిక్స్ సదస్సు జరిగింది. అనంతరం ఈ ఏడాది బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. భారత్ అధ్యక్షతన జరగనున్న సదస్సుకు సభ్యదేశాల అధినేతలు హాజరుకానున్నారు.
2024లో బ్రిక్స్‌లో ఇరాన్‌తో పాటు ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈలు పూర్తిస్థాయి సభ్యదేశాలుగా చేరాయి. ఆ తర్వాత గతేడాది ఇండోనేసియా కూడా కూటమిలో చేరింది. దీంతో ప్రస్తుతం బ్రిక్స్‌లో పూర్తిస్థాయి సభ్యదేశాల సంఖ్య 11కి చేరింది.
ఇదిలా ఉండగా, రెండు నెలల క్రితం దిల్లీలో జరిగిన బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు భారత్‌కు రానుండటం ఇరు దేశాల మధ్య సంబంధాల పరంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















