విజ్ఞానం, వివేకం, వికాసంతోపాటు ఉత్తమ భవిష్యత్తుకు పుస్తకాలు పునాది. అయితే మారుతున్న కాలంతో పాటు పుస్తక పఠనం క్రమంగా తగ్గిపోతోంది. స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరగడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలామంది పుస్తకాలు, గ్రంథాలయాలకు దూరమవుతున్నారు.
ఈ పరిస్థితిని మార్చడంతోపాటు గ్రంథాలయాలను ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేసే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రంథాలయాల్లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
విద్యార్థులు, పుస్తక ప్రియులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయి. ఇందుకోసం ‘గ్రంథాలయం’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గ్రంథాలయాల వద్ద ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు. పాఠకులు తమ మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తమకు నచ్చిన పుస్తకాలను డిజిటల్ రూపంలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు.
ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. అవసరమైన పుస్తకాలను సులభంగా అందుబాటులోకి తెచ్చుకోవడంతో సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం లభిస్తోంది.
సాంకేతికతను పుస్తక పఠనంతో అనుసంధానం చేయడం ద్వారా యువతను మళ్లీ చదువువైపు ఆకర్షించడంతోపాటు గ్రంథాలయ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ డిజిటల్ విధానం లక్ష్యంగా కనిపిస్తోంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















