‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనలో బ్యాంకింగ్ రంగం పాత్రను మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. బ్యాంకింగ్ రంగ భవిష్యత్ ప్రణాళికలు, అవసరమైన సంస్కరణలను సమీక్షించేందుకు త్వరలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ప్రభుత్వరంగ బ్యాంకుల సదస్సులో మాట్లాడిన ఆమె.. రాబోయే రెండు దశాబ్దాల్లో దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన మార్పులు, సంస్కరణలను ఈ కమిటీ సూచిస్తుందని వెల్లడించారు. బ్యాంకింగ్ రంగంలో చేపట్టాల్సిన సంస్కరణలపై బ్యాంకు అధిపతులు తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.
‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడానికి 20 ఏళ్ల సమయం మాత్రమే ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ రంగాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏలు) కనిష్ఠ స్థాయిలో ఉన్నందున.. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి అవసరమైన సంస్కరణలను వేగవంతం చేయడానికి ఇదే సరైన సమయమని తెలిపారు.
బ్యాంకింగ్ రంగంపై నిర్వహించే కాన్‌క్లేవ్‌లో చర్చించాల్సిన ఏడు కీలక అంశాలను ఆర్థిక సేవల విభాగం గుర్తించిందని మంత్రి చెప్పారు. యువతకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు సహకారం, ప్రాధాన్య రంగాలకు రుణాల అందజేత, క్రెడిట్ కార్డు వ్యాపారంలో మార్పులు వంటి అంశాలు ఇందులో ఉన్నాయని తెలిపారు.
ముఖ్యంగా యువత అవసరాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు తమ భవిష్యత్ ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. దేశ జనాభా నిర్మాణం, మారుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని బ్యాంకింగ్ సేవలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















