దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఎనిమిది ప్రధాన నగరాల్లో మొత్తం 91,729 ఇళ్ల యూనిట్లు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలంలో 97,674 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఈ ఏడాది ఇళ్ల విక్రయాల్లో 6 శాతం క్షీణత నమోదైంది. ఈ వివరాలను హౌసింగ్ బ్రోకరేజ్ సంస్థ ప్రాప్‌టైగర్ తన అధ్యయనంలో వెల్లడించింది.
దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల నివాస మార్కెట్‌పై సంస్థ అధ్యయనం చేసింది. ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో ఇళ్ల విక్రయాలు 7 శాతం, దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 7 శాతం, బెంగళూరులో 9 శాతం, పుణెలో 21 శాతం, కోల్‌కతాలో 9 శాతం, అహ్మదాబాద్‌లో 20 శాతం మేర తగ్గాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా కొనుగోలుదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని నివేదిక పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావంతో ఉద్యోగాలపై నెలకొన్న అనిశ్చితి కూడా ఇళ్ల కొనుగోళ్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిపింది.
అయితే హైదరాబాద్, చెన్నై నగరాల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ రెండు నగరాల్లో ఇళ్లకు డిమాండ్ పెరిగింది. చెన్నైలో అత్యధికంగా 36 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఏప్రిల్-జూన్‌లో 5,283 యూనిట్లు విక్రయించగా.. ఈ ఏడాది అదే కాలంలో 7,183 యూనిట్లకు పెరిగాయి.
హైదరాబాద్‌లోనూ ఇళ్ల విక్రయాలు 15 శాతం వృద్ధి చెందాయి. గతేడాది ఇదే కాలంలో 11,513 యూనిట్లు అమ్ముడవగా.. ఈ ఏడాది 13,196 యూనిట్లకు పెరిగాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో విక్రయాలు తగ్గినప్పటికీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మాత్రం డిమాండ్‌ను కొనసాగించడం గమనార్హం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















