పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. శిథిలావస్థలో ఉన్న ప్రహరీ గోడ కూలడంతో పదో తరగతి విద్యార్థి అరుణ తేజ(15) మృతి చెందాడు. మరో విద్యార్థి యాకోబు గాయపడ్డాడు.
సోమవారం ఉదయం తరగతులు ముగిసిన అనంతరం విద్యార్థులను మధ్యాహ్న భోజనం కోసం విడిచిపెట్టారు. భోజనం అనంతరం కొందరు విద్యార్థులు ఆరుబయటకు వెళ్లారు. తిరిగి పాఠశాలకు వస్తున్న సమయంలో ప్రహరీ గోడపై కొందరు విద్యార్థులు కూర్చున్నారు. అదే సమయంలో శిథిలావస్థలో ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది.
గోడపై ఉన్న విద్యార్థులు దాని కింద చిక్కుకుని గాయపడ్డారు. ఘటనను గమనించిన పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే వారిని సమీపంలోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అరుణ తేజ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. యాకోబుకు ప్రథమ చికిత్స అందించారు.
విద్యార్థి మృతి విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. మృతదేహంతో పాఠశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ అప్పలనాయుడు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. ఘటనపై స్పందించిన మంత్రి లోకేశ్ బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. గాయపడిన విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
శిథిలావస్థలో ఉన్న పాఠశాల ప్రహరీ గోడను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















