మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి.. వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మహిళా సమాఖ్య సంఘాలకు బస్సులను సమకూర్చి వాటి ద్వారా స్థిరమైన ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని 23 మండలాలకు ఒక్కో బస్సు చొప్పున 23 బస్సులను మహిళా సమాఖ్య సంఘాలకు అప్పగించింది.
మహిళా సంఘాలకు కేటాయించిన బస్సులను ఆయా బస్సు డిపోలకు అప్పగించారు. డిపోలు వాటిని వినియోగించుకుంటూ ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని అద్దెగా చెల్లిస్తున్నాయి. ఈ అద్దె సొమ్మును నేరుగా ఆయా మహిళా సంఘాల ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో సంఘాలకు ఎలాంటి నిర్వహణ భారం లేకుండానే క్రమం తప్పకుండా ఆదాయం సమకూరుతోంది.
ఒక్కో బస్సు కొనుగోలుకు రూ.36 లక్షలు ఖర్చు చేశారు. ఇందులో ప్రభుత్వం రూ.30 లక్షలు భరించగా.. మిగిలిన రూ.6 లక్షలను సంబంధిత మహిళా సంఘాలు తమ వాటాగా చెల్లించాయి. ఇలా మహిళా సంఘాల భాగస్వామ్యంతో బస్సులను సమకూర్చి.. వాటి ద్వారా ఆదాయం పొందే విధంగా వ్యవస్థను రూపొందించారు.
ఒక్కో బస్సుకు సంబంధిత డిపోలు నెలకు రూ.69,455 చొప్పున అద్దె చెల్లిస్తున్నాయి. ఇందుకు 72 నెలల పాటు అద్దె చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ లెక్కన ఒక్కో మహిళా సంఘానికి ఆరు సంవత్సరాల కాలంలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆదాయం సమకూరనుంది. మొత్తం మీద ఒక్కో సంఘం సుమారు రూ.54 లక్షల వరకు అద్దె ఆదాయం పొందే అవకాశం ఉంది.
జిల్లాలోని 23 మహిళా సమాఖ్య సంఘాలకు చెందిన బస్సుల ద్వారా నెలకు మొత్తం రూ.15.97 లక్షల వరకు అద్దె ఆదాయం వస్తోంది. ఈ మొత్తాన్ని సంఘాల ఖాతాల్లో జమ చేయడంతో భవిష్యత్తులో మహిళా సంఘాల ఆర్థిక కార్యకలాపాలకు ఇది ఉపయోగపడనుంది. సంఘాల సభ్యులకు ఉపాధి, ఆర్థిక స్వావలంబన కల్పించడంతోపాటు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఈ ఆదాయం దోహదపడనుంది.
జిల్లాలోని 23 మహిళా సమాఖ్యల్లో మొత్తం 2,676 మంది సభ్యులు ఉన్నారు. బస్సుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సంఘాల అవసరాలకు, సభ్యుల ఆర్థిక అభివృద్ధికి వినియోగించుకునే అవకాశం ఉంది. మహిళా సంఘాలను కేవలం పొదుపు, రుణ కార్యకలాపాలకే పరిమితం చేయకుండా.. ఆదాయాన్ని సమకూర్చే సంస్థలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో మహిళా సమాఖ్యలు: 23
సభ్యులు: 2,676
బస్సులు: 23
ఒక్కో బస్సు విలువ: రూ.36 లక్షలు
ప్రభుత్వ వాటా: రూ.30 లక్షలు
సంఘం వాటా: రూ.6 లక్షలు
ఒక్కో బస్సుకు నెలవారీ అద్దె: రూ.69,455
ఒప్పంద కాలం: 72 నెలలు
నెలవారీ మొత్తం అద్దె ఆదాయం: రూ.15.97 లక్షలు
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















