ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

సినిమాల నుంచి కుటుంబం వరకు.. అక్కినేని త్రయం పంచుకున్న ఆసక్తికర విషయాలివే

August 19, 2026
in Movies, News
0
సినిమాల నుంచి కుటుంబం వరకు.. అక్కినేని త్రయం పంచుకున్న ఆసక్తికర విషయాలివే

సినిమాల నుంచి కుటుంబం వరకు.. అక్కినేని త్రయం పంచుకున్న ఆసక్తికర విషయాలివే

Share on FacebookShare on TwitterShare on Whatsapp

దాదాపు తొమ్మిది దశాబ్దాల సినీ చరిత్ర ఉన్న అక్కినేని కుటుంబం నుంచి మూడు తరాలు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేశాయి. ఈ వారసత్వం, సినిమాలపై ప్రేమ, కుటుంబ అనుబంధం వంటి అంశాలపై నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

సినిమా పట్ల తనకు ఉన్న క్రమశిక్షణ, అభిరుచిని తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్‌) నుంచి నేర్చుకున్నానని నాగార్జున తెలిపారు. అదే లక్షణాలు ఇప్పుడు తన పిల్లల్లోనూ కనిపిస్తున్నాయని చెప్పారు. వారసత్వం అంటే కేవలం నటించడం మాత్రమే కాదని.. సినిమాకు సేవ చేయడం కూడా అందులో భాగమేనని పేర్కొన్నారు.

అన్నపూర్ణ స్టూడియోస్‌ తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైనదని నాగార్జున వివరించారు. చిత్ర పరిశ్రమలోకి రావాలనుకునే ఎంతోమంది కలలకు అది వేదికగా నిలుస్తోందని, వారి కలలకు ప్రాణం పోయడమే తమ వారసత్వంలో భాగమని అన్నారు.

‘హలో బ్రదర్‌’నే ఎంచుకున్న చైతూ, అఖిల్‌:

తమ తండ్రి నటించిన సినిమాల్లో ఏదైనా ఒకదానికి ఆడిషన్‌ ఇచ్చే అవకాశం వస్తే ఏ చిత్రాన్ని ఎంచుకుంటారని అడిగినప్పుడు నాగచైతన్య, అఖిల్‌ ఇద్దరూ వెంటనే ‘హలో బ్రదర్‌’ పేరును చెప్పడం విశేషం.అఖిల్‌ తాను ‘హలో బ్రదర్‌’ సినిమాను వందసార్లకు పైగా చూసినట్లు చెప్పారు. నాగచైతన్య మాత్రం ‘గీతాంజలి’, ‘మన్మథుడు’ వంటి ప్రేమకథా చిత్రాలంటే తనకు చాలా ఇష్టమని తెలిపారు. దీనిపై నాగార్జున సరదాగా స్పందిస్తూ.. తన పిల్లలు ‘హలో బ్రదర్‌’ సినిమాను వీహెచ్‌ఎస్‌ క్యాసెట్‌ అరిగిపోయేంతగా చూసేవారని గుర్తుచేసుకున్నారు.

నాన్న స్టార్‌డమ్‌ అప్పుడు అర్థమైంది..

తండ్రి గురించి తొలి జ్ఞాపకం ఏంటని ప్రశ్నించగా నాగచైతన్య తన చిన్ననాటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. చెన్నైలో ఉన్నప్పుడు తండ్రి సినిమాలను ఎక్కువగా క్యాసెట్లలో చూసేవాడినని చెప్పారు. అయితే నాగార్జున నటించిన ‘మాస్‌’ చిత్రాన్ని హైదరాబాద్‌లోని సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్‌లో ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూశానని తెలిపారు.

ఆ సమయంలో థియేటర్‌లో అభిమానుల సందడి చూసి.. తన తండ్రిపై ప్రేక్షకులకు ఉన్న ప్రేమ, అభిమానం ఏంటో తొలిసారి అర్థమైందని చైతన్య పేర్కొన్నారు.అఖిల్‌ కూడా చిన్నతనంలో తండ్రి సినిమాలకు ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు వెళ్లేందుకు ప్రయత్నించేవాడినని చెప్పారు. ఆడియో వేడుకలకు వెళ్లినప్పుడు వేలాది మంది అభిమానుల అరుపులు చూసినప్పుడే నాగార్జున స్టార్‌డమ్‌ స్థాయి తనకు అర్థమైందని తెలిపారు.

‘ఆ భారం ఎంతో పెద్దది’ :

అక్కినేని వారసత్వాన్ని కొనసాగించడంపై నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఎన్నార్‌ దాదాపు 250 సినిమాలు చేసిన తర్వాత తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చానని, తన తొలి సినిమా కూడా తండ్రి 251వ సినిమా తరహాలో ఉండాలని ప్రేక్షకులు ఆశించారని చెప్పారు.తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి 25-30 సినిమాల సమయం పట్టిందని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా విస్తృతంగా ఉన్న నేపథ్యంలో పరిస్థితులు మరింత సవాల్‌గా మారాయని అన్నారు. తన పిల్లలు తన వారసత్వంతో పాటు ఏఎన్నార్‌ వారసత్వాన్ని కూడా మోస్తున్నారని.. ఆ భారం ఎంతో పెద్దదని పేర్కొన్నారు.

కుటుంబంతో ఉన్నప్పుడు సినిమాల గురించి మాట్లాడరు :

పని, కుటుంబ జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకుంటారనే ప్రశ్నకు అఖిల్‌ ఆసక్తికరంగా స్పందించారు. పనిని ఇంటి బయటే ఉంచడం తన తండ్రి నాగార్జున, తాతయ్య ఏఎన్నార్‌ నుంచి నేర్చుకున్నామని చెప్పారు.

భోజనం చేసేటప్పుడు, సెలవులకు వెళ్లినప్పుడు సినిమాల గురించి అసలు మాట్లాడుకోమని అఖిల్‌ తెలిపారు. కుటుంబంతో గడిపే ఆ సమయం తమకు ఎంతో ఆనందాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుందని చెప్పారు.చివరగా తన పిల్లలకు నాగార్జున ఓ కీలక సూచన చేశారు. ప్యాషన్‌, క్రమశిక్షణను ఎప్పటికీ కోల్పోవద్దని, తమ మూలాలను మరచిపోకూడదని సూచించారు.

Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

Tags: Akhil AkkineniAkhil Akkineni MoviesAkkineni FamilyAkkineni LegacyAkkineni Nageswara RaoANRHello BrotherNaga ChaitanyaNaga Chaitanya MoviesNagarjunaNagarjuna MoviesshivasakthimediashivasakthinewsTelugu Cinema
ShareTweetSend
Previous Post

కాలువలో దిగిన ముగ్గురు.. ఒకరు గల్లంతు

Next Post

గచ్చిబౌలిలో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

Related Posts

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!
Business News

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

August 24, 2026
టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే
India News

టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

August 24, 2026
అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు
Business News

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు

August 24, 2026
స్థిరాస్తి సంస్థల బుకింగులకు బ్రేక్‌.. 21% క్షీణత
Business News

స్థిరాస్తి సంస్థల బుకింగులకు బ్రేక్‌.. 21% క్షీణత

August 24, 2026
‘చరిత్రను మర్చిపోవద్దు’.. పాక్‌ సైన్యానికి ఫజ్లుర్‌ రెహమాన్‌ హెచ్చరిక
World News

‘చరిత్రను మర్చిపోవద్దు’.. పాక్‌ సైన్యానికి ఫజ్లుర్‌ రెహమాన్‌ హెచ్చరిక

August 24, 2026
జామ్‌-2027 నోటిఫికేషన్‌ విడుదల.. 23 ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు అవకాశం
Education

జామ్‌-2027 నోటిఫికేషన్‌ విడుదల.. 23 ఐఐటీల్లో పీజీ ప్రవేశాలకు అవకాశం

August 24, 2026
Next Post
గచ్చిబౌలిలో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

గచ్చిబౌలిలో డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

August 24, 2026
రాశి ఫలాలు – మేషం

రాశి ఫలాలు – మేషం

August 24, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

చెస్‌లో ప్రపంచ రికార్డు అందుకున్న నారా దేవాంశ్‌.. స్పందించిన తండ్రి లోకేశ్‌

0
అమెరికాకు షాకిచ్చిన చైనా.. చర్చల వేళ రెండు దర్యాప్తులు మొదలు..!

సీన్ రివర్స్: అమెరికాపై చైనా ఎదురుదాడి.. సెమీకండక్టర్లపై రెండు కీలక దర్యాప్తులు!

0
తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

తిరుపతిలో అత్యాధునిక బస్ స్టేషన్‌ నిర్మాణం: సీఎం చంద్రబాబు

0
ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరిపిన తెలంగాణ ప్రభుత్వం

0
డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

August 24, 2026
టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

August 24, 2026
అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు

అమెరికా-ఇరాన్‌ ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. నష్టాల్లో దేశీయ మార్కెట్లు

August 24, 2026
స్థిరాస్తి సంస్థల బుకింగులకు బ్రేక్‌.. 21% క్షీణత

స్థిరాస్తి సంస్థల బుకింగులకు బ్రేక్‌.. 21% క్షీణత

August 24, 2026

Recent News

ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

డెరివేటివ్స్‌లో జెన్‌జీ జోరు.. నష్టాల్లోనూ ముందే!

August 24, 2026
టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

టోల్‌ ప్లాజా వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.. ఫాస్టాగ్‌ లోకల్‌ పాస్‌ ఆన్‌లైన్‌లోనే

August 24, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.