వందేమాతరం గీతాన్ని పూర్తిగా ఆలపించాలంటూ భాజపా చేస్తున్న విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. 1937లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తీసుకున్న తీర్మానానికే ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, జాతీయ గేయం వందేమాతరంలోని తొలి రెండు చరణాలను మాత్రమే ఆలపిస్తామని స్పష్టం చేసింది. దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్‌లో బుధవారం జరిగిన సీడబ్ల్యూసీ విస్తృత సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం వాటిని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
విద్యారంగంపై ప్రత్యామ్నాయ ప్రణాళిక
కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయంగా విద్యారంగ పునర్నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. నెల రోజుల్లోపు నిర్మాణాత్మక ప్రణాళికను రూపొందించి అందించాలని తెలంగాణ, కేరళ, హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆదేశించారు.
పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాహుల్‌గాంధీ ప్రారంభించిన ‘ఛాత్రోంకీ గూంజ్’ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా 800 నగరాల్లో నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇందులో కొన్ని కార్యక్రమాల్లో రాహుల్‌గాంధీ స్వయంగా పాల్గొననున్నారు.
అయోధ్య విరాళాల అంశంపై ఆందోళనలు
అయోధ్య రామమందిరం విరాళాల చోరీ ఆరోపణలు తీవ్రమైన అంశమని కాంగ్రెస్ పేర్కొంది. ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ అంశంపై అవినీతికి వ్యతిరేకంగా పీసీసీల ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది.
543 లోక్‌సభ స్థానాలపై డిమాండ్
దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను మరో 25 ఏళ్లపాటు ప్రస్తుత 543కే పరిమితం చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇదే స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరింది. ఈ అంశంపై తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవంగా చేసిన తీర్మానానికి సీడబ్ల్యూసీ మద్దతు ప్రకటించింది.
పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి
కాంగ్రెస్ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా **‘సంఘటన సృజన్ అభియాన్’**ను అక్టోబర్ 31 నాటికి దేశవ్యాప్తంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇప్పటివరకు 74 శాతం డీసీసీలు, 74 శాతం బ్లాక్ స్థాయి కమిటీలు, 52 శాతం మండల కమిటీలు, 57 శాతం బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం పూర్తయినట్లు కాంగ్రెస్ తెలిపింది. దేశవ్యాప్తంగా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు మొత్తం 15,58,250 మంది పదాధికారుల నియామకం పూర్తయిందని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















