ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం State Bank of India (ఎస్‌బీఐ) బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (బీఎస్‌బీడీ) ఖాతాదారులకు కీలక మార్పులు చేసింది. అక్టోబర్ 1 నుంచి నగదు ఉపసంహరణలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఉపసంహరణలపై ఉన్న నిబంధనలను సవరించింది.
నెలకు 4 విత్‌డ్రాయల్స్ ఉచితం :
బీఎస్‌బీడీ ఖాతాదారులు ఒక నెలలో మొదటి నాలుగు నగదు ఉపసంహరణలు మాత్రమే ఉచితంగా చేసుకోవచ్చు. ఇందులో ఎస్‌బీఐ ఏటీఎంలతో పాటు ఇతర బ్యాంకుల ఏటీఎంలు, బ్యాంకు శాఖలు, ఏఈపీఎస్ ద్వారా చేసే నగదు ఉపసంహరణలు కూడా కలుస్తాయి.నాలుగింటి తర్వాత చేసే ప్రతి నగదు ఉపసంహరణపై రూ.15 ఛార్జీ వసూలు చేస్తారు. దీనికి అదనంగా జీఎస్‌టీ చెల్లించాల్సి ఉంటుంది.
మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు :
బీఎస్‌బీడీ ఖాతాలో కనీస నిల్వ ఉంచాలనే నిబంధన లేదు. ఖాతాదారులు తమకు అందుబాటులో ఉన్న మొత్తాన్ని జమ చేసుకోవచ్చు. ఈ ఖాతాలో గరిష్ఠ నిల్వ పరిమితి కూడా లేదని ఎస్‌బీఐ పేర్కొంది.
డెబిట్ కార్డు ఉచితం :
బీఎస్‌బీడీ ఖాతాదారులకు ప్రాథమిక రూపే ఏటీఎం-కమ్-డెబిట్ కార్డును ఉచితంగా జారీ చేస్తారు. దీనికి వార్షిక నిర్వహణ ఛార్జీలు ఉండవు. అయితే ఈ ఖాతాదారులకు చెక్కు పుస్తకం అందుబాటులో ఉండదు.
మరో పొదుపు ఖాతా ఉండకూడదు :
బీఎస్‌బీడీ ఖాతా ఉన్న వ్యక్తి అదే బ్యాంకులో మరో పొదుపు ఖాతాను కొనసాగించడానికి వీలుండదు. ఇప్పటికే మరో సేవింగ్స్ ఖాతా ఉంటే.. బీఎస్‌బీడీ ఖాతా తెరిచిన 30 రోజుల్లోగా ఆ ఖాతాను మూసివేయాల్సి ఉంటుంది.
ఇతర సేవలపై ఛార్జీలు లేవు :
నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి మార్గాల ద్వారా నగదు జమ చేసేందుకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అదేవిధంగా నిరుపయోగంగా ఉన్న ఖాతాను తిరిగి ప్రారంభించేందుకు, ఖాతాను మూసివేసేందుకు కూడా ఎలాంటి రుసుములు వసూలు చేయరు.సరైన కేవైసీ పత్రాలు కలిగిన వ్యక్తులు ఈ బీఎస్‌బీడీ ఖాతాను వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా ప్రారంభించుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















