మంగళగిరి ప్రజలు, రైతుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక సదుపాయాలతో మోడల్ రైతుబజార్ రూపుదిద్దుకోనుంది. నిడమర్రు రైల్వే గేట్ సమీపంలో అరబిందో ఫార్మా ట్రస్ట్ సీఎస్‌ఆర్ నిధులు రూ.18 కోట్లతో 5.90 ఎకరాల్లో ఈ మార్కెట్‌ను నిర్మించనున్నారు. గురువారం మంత్రి నారా లోకేశ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
మొత్తం 71,925 చదరపు అడుగుల విస్తీర్ణంలో రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లను ఏర్పాటు చేయనున్నారు. రిటైల్ విభాగంలో 102 కూరగాయల స్టాళ్లు, పండ్లు, పూల విక్రయాలకు 54 స్టాళ్లు, ఇతర వస్తువుల కోసం 60 షాపులు అందుబాటులోకి రానున్నాయి.
హోల్‌సేల్ మార్కెట్‌లో 18 అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌లు, 23 కూరగాయల షాపులతో పాటు కోల్డ్ స్టోరేజీ, కూరగాయల శుభ్రపరిచే ప్రాంతం, క్యాంటీన్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. సరకు రవాణా వాహనాలతో పాటు ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించనున్నారు.
రైతులు తమ పంటలను నేరుగా, సౌకర్యవంతంగా విక్రయించుకునేలా మార్కెట్‌ను తీర్చిదిద్దడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆధునిక సదుపాయాలతో మోడల్ రైతుబజార్ అందుబాటులోకి వస్తే మంగళగిరి ప్రజలకు, స్థానిక రైతులకు మరింత ప్రయోజనం కలగనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















